ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. అందులో జంతువులకి సింహం రాజు .నక్క దానికి మంత్రి. ఒకరోజు ఆ సింహం, నక్క ఆలా బయటికి అడవిలోకి బయలుదేరాయి. మార్గం మధ్యలో వాటికి ఒక ఆలోచన వచ్చింది. సింహం గురుంచి మిగతా జంతువులు ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలి అని.
ఇలా ఇవి మాట్లాడుకుంటూ ఉండగా ఒక పులి అటువైపు నుండి పోతుంది. "ఏం నక్క బావ! ఏంటి ఏదో మంచి జోరు మీద బయలు దేరారు ఇద్దరు" దానికి నక్క " ఆ ! ఎం చెప్పమంటావులే పులి బావ! సింహం బావకి ఈ అడవిలో ఉండటం ఇష్టం లేదంట ఈ అడవి విడిచి వెళ్ళిపోతాను అంటుంది. నేను వద్దు అని వారిస్తున్నా! అంతే!
దానికి పులి " మొన్న అడవి మొత్తం తగలబడిన సమయంలో ఎన్నో జంతువులు చనిపోయాయి. కనీసం పలకరించాడనికి కూడా పోలేదు. ఒక రాజు చేయాల్సిన బాధ్యత ఆయనలో ఏమి కనిపించడంలేదు. ఇలాంటి రాజునూ పోతాను అన్నప్పుడు పోనివ్వండి ఆపకూడదు " అని పులి వెళ్లిపోయింది.
పులి మాటలకి సింహం మొహం మాడిపోయింది. సింహం పరిస్థితి గమనించిన నక్క " వొదిలెయ్ సింహం బావ ! పులి ఎప్పుడు అలాగేయ్ అంటది! ఆ కొంగను అడుగుతాను అని కొలను పక్కన చేపలు వెతుకుతున్న కొంగని అడిగింది.
" సింహం గారి గురుంచి ఏమి చెప్పాలి. సింహం పుట్టిన రోజు అని శుభాకాంక్షలు తెలపడానికి సింహం గుహలోకి వెళ్లిన మూడు కుందేళ్లు ఇంకా రాలేదు. వస్తాయో రావో లేక సింహానికి ఆహారం అయి ఉంటాయి అని అందరం అనుకుంటున్నాం.ఇలాంటి రాజు ఉన్న ఒకటే పోయిన ఒకటే అని నా ఉద్దేశం." అంటూ ఎగిరిపోయింది.
ఈ మాటలు విన్న నక్కకి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. నక్క సింహం మిగతా జంతువులు తమ గురుంచి ఏమనుకుంటున్నాయో అర్ధం చేసుకున్నాయి.
ఇదంతా దూరం నుండి చూస్తున్న ఒక తాబేలు సింహం దగ్గరికొచ్చి "రాజా ! మీరు ఒక మంచి రాజా! లేక చెడ్డ రాజా అని చెప్పను. అది మీ అంతరాత్మకు తెలుసు! మేము మీ కన్నా చిన్న జంతువులం. మీరు మంచిగా పరిపాలిస్తే అందరం బ్రతికిపోతాం.
మిమ్మల్ని ఎదురించే శక్తీ మా లాంటి చిన్న జీవులకి ఎప్పుడు దొరకదు. కానీ! మీ పరిపాలన ఎలా ఉన్న, మీరు పోయిన రోజు, మేము అందరం కన్నీళ్లు పెట్టుకునేలా పరిపాలించండి. ఆ రోజు! ఈ అడవిలో ఏ జంతువు కూడా బాధతో అన్నపానీయాలు ముట్టుకోకూడదు" అని వెళ్లి పోయింది.
తాబేలు మాటలకి సింహం కళ్ళు తెరుచుకున్నాయి. ఒకరి బలం అనేది.. తనవాళ్ళకి తోడు కావలి కానీ ప్రమాదం కాకూడదు అని ఆ రోజు నుండి సింహం అడవిలో జంతువులని ప్రేమతో చూసుకుంటూ ఎన్నో ఏళ్ళు ఆ అడవిని పాలించింది.
0 Yorumlar